Tuesday, April 23, 2024

ఆర్ఆర్ఆర్ లో అలియా కోసం మరిన్ని సీన్లు

పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగు చివరి దశకి చేరింది. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రను పోషిస్తుండగా.. చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తాడు. చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తోంది. ఆయా పాత్రలకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. ఇక చరణ్, అలియాలపై ఒక పాట మాత్రం మిగిలివుంది. అయితే సీత పాత్రకు ఇప్పుడు అదనంగా కొన్ని సీన్లను జతచేయాలని  దర్శకుడు రాజమౌళి భావిస్తున్నాడట. మిగిలిన ఒక్క పాట తో పాటు అలియా భట్ ఆ పాత్రకు సంబంధించిన సీన్లను కూడా ఒకే కాలంలో చిత్రీకరించనున్నారట. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement