Friday, April 19, 2024

స్పార్క్‌ మూవీలో రుక్సార్‌ ధిల్లాన్‌..

యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘స్పార్క్‌’. ఇందులో మెహ్రీన్‌ పిర్జాదా హీరోయిన్‌గా నటించనుంది. విక్రాంత్‌ హీరోగా పరిచయమవుతున్నారు. హృదయమ్‌ ఫేమ్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో నటించే మరో హీరోయిన్‌ పేరు కూడా ప్రకటించారు. రుక్సార్‌ ధిల్లాన్‌ నటించనుంది.

విశ్వక్‌సేన్‌తో ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ లొ రుస్కార్‌ నటించింది. అరవింద్‌ కుమార్‌ రవి వర్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అందమైన లొకేషన్లలో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో వెన్నెల కిశోర్‌, సత్య, శ్రీకాంత్‌, కిరణ్‌ అయ్యంగార్‌, అన్నపూర్ణమ్మతో పాటు- పలువురు నటీ-నటు-లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement