Wednesday, November 27, 2024

Rukmini Vasanth | ‘సప్తసాగరాలు దాటి’న అందం

కన్నడ భామ రుక్మిణి వసంత్ ‘సప్తసాగరాలు దాటి’ మూవీ సిరీస్ తో మంచి గుర్తింపు అందుకుంది. అందులో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత కన్నడ నాట రుక్మిణి స్టార్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తెలుగు, తమిళ్ భాషలలో కూడా తెరంగేట్రం చేసింది.

ఇక తమిళంలో విజయ్ సేతుపతి కి జోడీగా ‘ఏస్’ అనే సినిమా చేస్తోంది. అలాగే శివ కార్తికేయన్ ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తోంది. తెలుగులో కొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తోంది.

ఇలా మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ తన టాలెంట్ తో రుక్మిణి వసంత్ అందరికి చేరువ అవుతోంది. మరీ ఎక్కువగా గ్లామర్ అవుట్ ఫిట్ లతో కనిపించకపోయిన చక్కనైన చీరకట్టులో కూడా రుక్మిణి వసంత్ సమ్మోహనం చేస్తోంది. అందుకే ఆమెకి కుర్రాళ్ళు ఫ్యాన్స్ గా మారిపోతున్నారు.

ఈ బ్యూటీని తెలుగులో మంచి సక్సెస్ ఫుల్ మూవీలో చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే రుక్మిణి వసంత్ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన బగీరా మూవీ ఓటీటీలోకి వచ్చింది.

ఇందులో ఆమె లుక్స్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో చాలా చక్కగా రుక్మిణి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెస్మరైజ్ చేసే అందంతో, మాయ చేసే నవ్వుతో ఇట్టే ఆకట్టుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement