Saturday, April 20, 2024

ఆర్ఆర్ఆర్ సెట్ అలియాభట్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తుండగా… రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయింది.

కాగా తాజాగా అలియాభట్ ఆర్ఆర్ఆర్ లో షూటింగ్ చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అలియా భట్ ఓ ఫోటో ద్వారా ప్రకటించింది. ఇక ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ, సారథి స్టూడియోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్లో జరుగుతోంది. అలాగే మరో ముఖ్యమైన పాటను చిత్రీకరించడానికి తూర్పు ఐరోపాకు చిత్రబృందం వెళ్లనుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన టీజర్, మేకింగ్ వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement