Tuesday, April 23, 2024

ఆర్ఆర్ఆర్ @ మ్యూజిక్ సెషన్ ముగిసింది…అనిరుద్ పై కీరవాణి ప్రశంసలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ ఆర్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియాభట్ కూడా నటిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఓ ప్రమోషనల్ సాంగ్ కోసం సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ మ్యూజిక్ సెషన్ ముగిసింది. కాగా అనిరుధ్ తో గొప్ప మ్యూజిక్స్ సెషన్ జరిగింది అంటూ కీరవాణి ట్వీట్ చేశారు. సమర్ధత, శక్తి, ప్రతిభ అద్భుతమైన సహచరుల బృందం అతని ప్రధాన ఆస్తులు అంటూ ట్వీట్ చేస్తూ అనిరుద్ పై ప్రశంసలు కురిపించారు కీరవాణి. కీరవాణి ట్వీట్ కు అనిరుధ్ స్పందిస్తూ…. ఇట్ వాజ్ మై ప్లెజర్ సర్… మచ్ లవ్ టూ యు అండ్ యువర్ టీం అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement