Friday, April 26, 2024

24 గంటల్లో RRR మేకింగ్ వీడియో దుమ్ముదులిపే రిజల్ట్

బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.

ఈ మేకింగ్ వీడియో యూట్యూబ్ లో దుమ్ము దులుపుతుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా వ్యూస్ ని పొందిన మేకింగ్ వీడియో గా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ వీడియోకు ఆరు పాయింట్ మూడు మిలియన్ల వ్యూస్ రాగా 457 కే లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఏ మేకింగ్ వీడియోకి ఈ స్థాయిలో రాలేదు. ఇదే ఎక్కువ. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్, అలియా భట్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement