Saturday, April 20, 2024

RRR @ మేకింగ్ వీడియో మాములుగా లేదు

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమురంభీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ పాత్రలకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అయితే తాజాగా చిత్ర యూనిట్ చెప్పినట్టుగానే ఆర్ ఆర్ ఆర్ నుంచి రోర్ విడుదలైంది. ముందుగా చెప్పినట్లు షూటింగ్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. భారీ స్థాయిలో షూటింగ్
జరుగుతున్నట్లు ఈ మేకింగ్ వీడియోను చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానున్నట్లు గా ప్రకటించింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement