Friday, April 19, 2024

3 కోట్ల రూపాయలతో సాంగ్ @RRR ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నాడు. ఇక తాజాగా చిత్రయూనిట్ ఓ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక పాటకు మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నాడట రాజమౌళి. అయితే ఎవరి మీద ఆపాట చేశారు ఎలా ఉండబోతుంది అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లోనే ఈ పాటను షూట్ చేయబోతున్నారట. ఇక ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు డి.వి.వి.దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement