Wednesday, April 24, 2024

20 మిలియన్ల వ్యూస్…లెక్క పెరుగుతుంది @RRR

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్, అలియాభట్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆదివారం ఈ సినిమాకు సంబంధించి దోస్తీ ప్రమోషనల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

అయితే ఈ సాంగ్ తాజాగా 20 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ పాటలో మొత్తం మ్యూజిక్ డైరెక్టర్స్ అమిత్ త్రివేది, ఎం ఎం కీరవాణి, అనిరుద్ విజయ్ లు కనిపించారు. అలాగే రామ్ చరణ్ కూడా కనిపించారు. అంతేకాకుండా 5 భాషలలో పాట పాడిన సింగర్ కూడా కనిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement