Friday, September 24, 2021

RRR: విడుదలయిన దోస్తీ సాంగ్..

పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి ప్రెండిషిఫ్ డే సందర్భంగా దోస్తీ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మూవీ రిలీజ్ డెట్ దగ్గర పడుతున్న కొద్ది చిత్ర యూనిట్ ప్రమోషన్ ని పెంచింది అందులో భాగంగానే.. ఇద్ద‌రి స్నేహితుల మ‌ధ్య ఫ్రెండ్షిప్ నేప‌థ్యంలో ఈ సాంగ్ రూపొందిన సాంగ్ ని విడుదల చేశారు. ఈ రోజు స్నేహితుల సంద‌ర్భంగా విడుద‌లైన ఈ పాట శ్రోత‌ల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. కీరవాణి త‌న‌దైన శైలిలో బాణీలు స‌మ‌కూర్చారు. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది ఈ సాంగ్‌. ఐదు భాషల్లోనూ… బాణీ ఒక్కటే. కానీ, గాత్రం మాత్రం వేర్వేరు. తెలుగులో హేమచంద్ర, తమిళంలో అనిరుధ్‌ రవిచందర్‌, హిందీలో అమిత్‌ త్రివేదీ, మలయాళంలో విజయ్‌ యేసుదాసు, కన్నడలో యాజిన్‌ నిజార్‌ పాడారు. తెలుగులో ఈ పాటకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా… తమిళంలో మదన్‌ కర్కి, హిందీలో రియా ముఖర్జీ, కన్నడలో ఆజాద్‌ వరదరాజ్‌, తమిళంలో మన్‌కొంబు గోపాలకృష్ణన్‌ రాశారు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇది కూడా చదవండి :

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News