Thursday, April 25, 2024

RRRలో మరో హీరోయిన్

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR(రౌద్రం-రణం-రుధిరం) మూవీలో మరో హీరోయిన్ నటించబోతుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీతారామరాజుగా చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాలో చరణ్‌కి జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, ఎన్టీఆర్‌కి జంటగా బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. అయితే, మూవీలో ఎన్టీఆర్‌ని ప్రేమించే ఒక గిరిజన యువతి పాత్ర ఉండగా.. ఆ పాత్రను ఐశ్వర్య రాజేష్‌తో చేయించాలని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement