Friday, March 29, 2024

RGV తో అషురెడ్డి బోల్డ్​ ఇంటర్వ్యూపై ఆమె తల్లి రియాక్షన్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలో అషురెడ్డి ఎంత బోల్డ్ గా మాట్లాడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా వర్మ అంటేనే బోల్డ్ నెస్ కు మారుపేరు. నిర్మొహమాటంగా మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పేస్తారు. ఇక అషురెడ్డితో ఇంటర్వ్యూ సందర్భంలోనూ వర్మ అలాగే బిహేవ్ చేశారు. థైస్ బాగున్నాయంటూ కామెంట్ చేయడంతో.. ఆమె వర్మను లాగి పెట్టి కొట్టింది. ఇంటర్వ్యూ అంతా అలాగే సాగింది. అంతేకాదు అమ్మాయి అందాల గురించి ఆయన ఓపెన్‌గా మాట్లాడతారని ఇప్పటిదాకా మనసు తెలుసు.. కానీ అదే అమ్మాయిని నేరుగా పో** వీడియోల గురించి కూడా అడిగేస్తాడని ఇప్పుడే తెలిసింది. ఆర్జీవీ- అషు రెడ్డి బోల్డ్ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో రిలీజ్ చేశాడు వర్మ..

పాచ్చిగా మాట్లాడుతూ అషురెడ్డి కి మతిపోయే ప్రశ్నలు వేశాడు ఆర్జీవీ. దీంతో షాకైన అషురెడ్డి ఆ సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వదలని వర్మ ఆమె చేత ఆన్సర్ చెప్పించారు. నా స్నేహితులు చూస్తారు కానీ నేను చూడను అని మొదట చెప్పిన అషు.. ఆ తర్వాత ఓపెన్ అయింది. అవును చూస్తాను అని చెప్పింది.

మరి, ఆ ఇంటర్వ్యూని చూసిన అషురెడ్డి తల్లి స్పందన ఎలా ఉంటుంది? ఇదిగో ఆ వీడియోనే అషురెడ్డి షేర్ చేసింది. ‘ఇదీ.. మా అమ్మ నా దగ్గరకు వచ్చి చెప్పింది’ అంటూ పోస్ట్ పెట్టింది. ఆ వీడియోలో అషును ఆమె మెచ్చుకుంది. ఇంటర్వ్యూ బాగుందని, బోల్డ్ గా, స్ట్రాంగ్ గా ఉందని చెప్పింది. సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చేలా ఉందని అషును ప్రశంసించింది. ఆ వీడియోను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

YouTube video

ఇది కూడా చదవండి: బీ రెడీ: థియేటర్లకు అమ్మ వస్తోంది!

Advertisement

తాజా వార్తలు

Advertisement