Friday, April 19, 2024

పుష్ప విలన్ కు తెలుగు హీరోలకన్నా ఎక్కువ రెమ్యునరేషనట?

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది, గతంలో సుకుమార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాలో విలన్ గా జాతీయ అవార్డు గ్రహీత, మలయాళీ స్టార్‌ హీరో ఫహద్‌ ఫాజిల్‌ నటించబోతున్నారు. ఇందుకు గాను ఫాజిల్‌కు ఐదు కోట్ల రూపాయల పారితోషికంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మన దగ్గర చిన్న హీరోలు సైతం ఈ రేంజ్‌లో పారితోషికం డిమాండ్‌ చేయడం లేదు. అలాంటిది విలన్‌ పాత్ర చేసే ఫాజిల్‌కు ఇన్ని కోట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.మలయాళం లో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకునే ఆ రెమ్యునరేషన్ కి ఒకే చేసినట్టు తెలుస్తుంది.

ట్రాన్స్ , సూపర్ డీలక్స్ నటించిన ఫహద్ కు సౌత్ ఇండస్ట్రీ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ పుష్ప వంటి తెలుగు సినిమాలో నటించటానికి ఒకే చెయ్యటంతో మలయాళం, తమిళ్, కన్నడ మార్కెట్ లలో కూడా సినిమాపై అంచనాలు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement