Friday, April 19, 2024

ఇలియానా ని గుర్తుపట్టారా ?

మామూలుగా హీరోయిన్స్ ని మేకప్ లేకుండా గుర్తు పట్టడం చాలా కష్టం. అలానే మేకప్ ఎక్కువైనా గుర్తుపట్టడం కష్టమే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలు ఉన్నది ఎవరో కాదు. గోవా బ్యూటీ..ఇలియానా. ఇలియానా వితౌట్ మేకప్ చెమటలు పడుతూ కనిపించింది. అలానే ఈ ఫోటో చూసిన వారు ఇలియానాను గుర్తుపట్టడం కష్టంగానే భావిస్తారు.

ఎందుకంటే మేకప్ లేకపోవడంతో కెమెరా టాప్ యాంగిల్ వుండటంవల్ల గుర్తించడం కష్టంగా అనిపిస్తుంది. దీనిపై నెటిజన్స్ కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ గోవా బ్యూటీ. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అయితే అక్కడ అనుకున్న స్థాయిలో రాణించలేక పోయింది. ఆ తర్వాత ప్రేమ పెళ్లి అంటూ లావుగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement