Thursday, April 18, 2024

ఓటిటిలో ఒక్కరోజే వంద కోట్లా ?

ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రాధే. అయితే ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో స్ట్రీమ్ కావడంతో ఓపెనింగ్ డే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా వెండితెర పై ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో… అదే స్థాయిలో మొదటి రోజు వంద కోట్ల రూపాయలను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక మొదటి రోజు ఏకంగా 4.2 మిలియన్లు మంది పేపర్ వ్యూ ద్వారా సినిమా చూశాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దిశా పటాని నటించగా… అల్లు అర్జున్ డీజే సినిమా లోని సిటీ మార్ సాంగ్ రీమేక్ సాంగ్ హైలెట్ గా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement