Monday, October 18, 2021

Rc 15: జిమ్ లో కష్టపడుతున్న రామ్ చరణ్, కియారా

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సనిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి జోడి కట్టబోతున్న విషయం తెలిసిందే. వినయ విధేయ రామలో చరణ్ తో కలిసి నటించిన కియారా.. రెండవసారి చరణ్ తో రొమాన్స్ చేయనుంది. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన వినయ విధేయ రామ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ కియారా, చరణ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా వీరిద్దరూ మరోసారి జోడి కడుతుండం ఆసక్తికరంగా మారింది. తాజాగా వీరిద్దరూ కలిసి జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ కలిసి జిమ్ లో నిపుణుడి సమక్షంలో ఎక్సర్ సైజులు చేస్తున్నారు. ఫిట్ నెస్ కోసం ఇద్దరూ బాగా శ్రమిస్తున్నారు. కాగా త్వరలోనే “ఆర్సి 15” ప్రారంభం కానుంది. ఈ సినిమాకు “విశ్వంభర” అనే టైటిల్ ను అనుకుంటున్నారనే టాక్ నడుస్తోంది.

ఇది కూడా చదవండి: “ఎన్టీఆర్ 30” లాంచ్ డేట్ ఫిక్స్..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News