Thursday, April 25, 2024

రవితేజ లైనప్ లో ఇది హైలెట్ గా ఉంటుందట !!

గత ఏడాది ఆఖరులో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా తర్వాత కూడా రవితేజ మంచి లైనప్ ఏర్పాటు చేస్తున్నాడట.

అందులో భాగంగానే తమిళ మరియు తెలుగు సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శరత్ మందవ తో కూడా రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో ప్రతి అంశం కూడా అదిరిపోతుందని తెలుస్తోంది. టైటిల్ అలాగే థీమ్ సాంగ్, ఫస్ట్ లుక్ ప్రతిదీ కూడా అదిరిపోతాయట. ఇక ఈ సినిమా జూలై నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement