Thursday, April 25, 2024

రవితేజ ఖిలాడి ఆగిపోయిందా !!

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అలాగే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. అలాగే శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. అయితే యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కొన్ని రోజుల పాటు షూటింగ్ ను జరిపితే ఈ సినిమా మొత్తం పూర్తవుతుంది.

కానీ ఇటువంటి సమయంలో ఈ సినిమాను నిలిపివేసినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్లానింగ్ లేకపోవడంతో పాటు ఖిలాడి కోసం తాను ముందుగా ఇచ్చిన డేట్స్ పూర్తికావడంతో రామారావు ఆన్ డ్యూటీ సెట్స్ కి వెళ్లాడట రవితేజ. కాగా ఖిలాడి దర్శక నిర్మాతలు రవితేజ తో మాట్లాడి వీలైనంత తొందరగా ఈ సినిమాని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement