Monday, March 25, 2024

6న రావ‌ణాసుర టీజ‌ర్

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర. సుధీర్‌ వర్మ దర్శకుడు. సుశాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు సుధీర్‌ వర్మ షూటింగ్‌ పార్ట్‌ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చేశారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. టీ-జర్‌ ను మార్చి 6వ తేదీన విడుదల చేయనున్నట్లు- మేకర్స్‌ ప్రకటించారు. భారీ నిర్మాణ విలువలతో రావణాసుర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ మరియు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుండి వచ్చిన రెండు పాటలు పాపులర్‌ అయ్యాయి. శ్రీకాంత్‌ విస్సా కథని అందించారు, ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదలకు సిద్ధమవుతోంది.రవితేజ, సుశాంత్‌, శ్రీరామ్‌, అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్‌, పూజిత పొన్నాడ, రావు రమేష్‌, తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement