Friday, April 26, 2024

‘జాతిరత్నాలు’ అసలు లాభాలు ఇవే !!

ఎవ్వరూ ఊహించని విధంగా జాతిరత్నాలు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. భారీ స్థాయిలో వసూళ్లను కూడా రాబట్టింది. తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమా టోటల్ రన్ పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల నుంచి 32 కోట్లకు పైగా షేర్స్ వసూలు చేయగా…ఓవరాల్ గా 38 కోట్లు షేర్స్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి స్థాయిలో లెక్కలు చూసుకుంటే నైజాంలో 16 కోట్లు, సీడెడ్ 4.27 కోట్లు, ఉత్తరాంధ్ర 3.97 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా 1.92 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 1.52 కోట్లు, గుంటూరు 2.08 కోట్లు, కృష్ణ 1.85 కోట్లు, నెల్లూరు 91 లక్షలు, ఇంకా తెలంగాణ ను కలుపుకొని 32.52 కోట్లు వసూలైంది.

అలాగే కర్ణాటక ఇతర భాషలు కలుపుకొని 1.32 కోట్లు సాధించింది. అమెరికా విదేశాలనుంచి 4.28 కోట్లు వసూళ్ళను సాధించింది. ఓవరాల్ గా 38.52 కోట్లు వసూలు చేయగా.. 64.20 కోట్ల ఓవరల్ గ్రాస్ వసూలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement