Thursday, March 28, 2024

పుష్ప సాంగ్ పై రష్మిక మందన్న రియాక్షన్

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. విడుదలైన గంటల వ్యవధిలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ పాటపై హీరోయిన్ రష్మిక మందన్న తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఈ పాట అద్భుతంగా ఉంది. అమేజింగ్ క్రేజీ స్టాఫ్.. ఇది సరైన పద్ధతి కాదు.. పెద్ద ఐస్ బర్గ్ లోని చిన్న ముక్కను చూపించడం.. సరైన పద్ధతి కాదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాను డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement