Friday, April 19, 2024

పాన్ ఇండియా స్టేటస్ తో ఫుల్ ఎంజాయ్.. వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న రష్మిక..


శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ను ఎంజాయ్ చేస్తోంది. అగ్ర హీరోలంద‌రితో వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. గ‌త ఏడాది చివ‌ర‌లో విడుద‌లైన ‘‘పుష్ప ది రైజ్’’ చిత్రం విజ‌యాన్ని సాధించ‌డంతో ర‌ష్మిక‌కు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు వ‌చ్చింది. ఇప్పుడు అదే ఆమెకు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో న‌టించే చాన్స్ తెచ్చిపెట్టింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే అది కూడా పాన్ ఇండియా సినిమా అని అంతా చెప్పుకుంటున్నారు. ఇంత‌కీ ర‌ష్మిక మంద‌న్న త‌దుప‌రి చాన్స్ కొట్టేసిన పాన్ ఇండియా సినిమా ఎవరిదో తెలుసా? మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మూవీ. ప్రస్తుతం RRR సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న చ‌ర‌ణ్ త‌దుప‌రి శంక‌ర్ డైరెక్షన్ లో వచ్చే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.


శంకర్ డైరెక్ట్ చేయనున్న ఈ ప్రాజెక్టు కూడా పాన్ ఇండియా మూవీ. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌. దీని త‌ర్వాత కూడా చ‌ర‌ణ్ పాన్ ఇండియా సినిమా చేయ‌బోతున్నారు. జెర్సీతో తెలుగులో హిట్ కొట్టి.. అదే సినిమా రీమేక్‌తో బాలీవుడ్ ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించ‌నున్న ద‌ర్శకుడు గౌత‌మ్ తిన్ననూరి డైరెక్షన్‌లో చ‌ర‌ణ్ సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మించనుంది.


RC16గా తెర‌కెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. హీరోయిన్‌గా ఎవ‌రినీ తీసుకోవాల‌ని నిర్మాత‌లు ఆలోచిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న అయితే స‌రిపోతుంద‌ని అంతా భావిస్తున్నారు. ఆమెకు ఇప్పుడు ఎలాగూ పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ ఉంది. అలాగే బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తోంది కాబ‌ట్టి ఆమెను RC16లో హీరోయిన్ అనుకుంటున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇదే క‌నుక నిజ‌మైతే ర‌ష్మిక మంద‌న హీరోయిన్‌గా మ‌రో మెట్టు ఎక్కిన‌ట్లేన‌ని టాలీవుట్ వర్గాలు అనుకుంటున్నాయి.


సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా శాంత‌న్ భ‌గ్చీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ‘‘మిష‌న్ మ‌జ్ను’’ లో కూడా ర‌ష్మిక నటిస్తోంది. ఈ సినిమా రియ‌ల్ ఇన్‌సిడెంట్‌ను బేస్ చేసుకుని రూపొందిస్తున్నారు. పాకిస్థాన్ అణ్వాయుధాల‌ను త‌యారు చేస్తుంద‌ని తెలుసుకోవ‌డానికి ఇండియా నిర్వహించిన అతి పెద్ద కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ ఆధారంగానే ఈ మూవీ తెర‌కెక్కుతోంది. దీంతో పాటు ‘‘గుడ్ బై’’ అనే మ‌రో సినిమాలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చన్‌తో క‌లిసి రష్మిక న‌టిస్తోంది. దీనికి వికాస్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement