Friday, April 19, 2024

ఆ సీక్రెట్…సీక్రెట్ గానే ఉంటుందా ?

రష్మిక మందన ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.ఛలో న్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోష్ మీద ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కూడా నటిస్తోంది.

ఇదిలా ఉండగా హోలీ పండుగను పురస్కరించుకుని ఓ స్పెషల్ గిఫ్ట్ రష్మిక ఇంటికి చేరిందట. ఈ విషయాన్ని మరెవరో కాదు తనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ కానుక ఎవరు పంపారో కానీ… అది నాకు అందింది. పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. చాలా నచ్చింది కూడా… పనిలో పనిగా మీరు రాసిన సీక్రెట్ మెసేజ్ లు కూడా చదివాను.. అంటూ చెప్పుకొచ్చింది. గిఫ్ట్ వచ్చిన ఉంగరాన్ని వేలికి తొడిగి ఆ ఫోటో ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఆ సీక్రెట్ గా ఎవరు పంపించారు.. అనేదానిపై అభిమానులు సినీ ప్రేక్షకులు నెట్టింట్లో చర్చలు మొదలు పెట్టేసారు. ఖచ్చితంగా అది బాయ్ ఫ్రెండు పంపించే ఉంటాడు అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే మరికొంతమంది విజయ్ దేవరకొండ పేరు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement