Tuesday, April 16, 2024

డానియల్ శేఖర్ కోసం రానా ఎంత తీసుకున్నాడంటే..?

పవన్ కళ్యాణ్, రానా సంయుక్తంగా నటిస్తున్నా సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ఈ సినిమా. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండటంతో టైటిల్ ‘భీమ్లా నాయక్‌’ అని పెట్టారు. అయితే దీంతో తెలుగులో స్క్రిప్ట్ మొత్తం మారి వన్ సైడ్ గా ఉంటుందనే వాదనలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. అయితే నిర్మాత ఈ విషయమై ట్విటర్ లో మొత్తం చూసిన తర్వాత కామెంట్స్ పెట్టాలనడంతో సెకండ్ హీరో రానా పోషిస్తున్న డానియల్ శేఖర్ కూడా ప్రాధాన్యత ఉంటుందని అర్ధం అయింది. రానా ఈ సినిమా కోసం 25 డేస్ కాల్షీట్స్ ఇచ్చాడట. అంతే కాదు దాదాపు 4 కోట్ల పారితోషికం కూడా తీసుకుంటున్నాడట. నిజానికి సోలో హీరోగా రానాకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు.

అయినా తను డిమాండ్ చేసిన దానికి నిర్మాతలు ఓకె చెప్పటానికి కూడా కారణం ఉంది. ఇప్పుడున్న యువ హీరోలు ఈ పాత్రను పోషించాటానికి ఇష్టపడ లేదట. అందుకే రానా దానిని క్యాష్ చేసుకున్నాడని అంటున్నారు. అయితే ఏమాటకు ఆ మాట చెప్పాలి. విడుదలైన రానా ‘డానియల్ శేఖర్’ టీజర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్నట్లే ఈ పాత్రను తీర్చిదిద్దితే మాత్రం తప్పకుండా రానాకు కూడా మంచి పేరు వచ్చే అవకాశం లేకపోలేదు. చూద్దాం… ఏం జరుగుతుందో!?

ఇది కూడా చదవండి: చెప్పినట్లు హెయిర్ కట్ చేయలేదని రూ.2 కోట్ల జరిమానా

Advertisement

తాజా వార్తలు

Advertisement