Thursday, April 18, 2024

రెమ్యునరేషన్ పెంచేసిన రామ్ ?

హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఇటీవల రామ్ రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇదిలా రామ్ తాజాగా తన రెమ్యునరేషన్ ని పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ద్విభాషా సినిమాలో నటించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన చూపిన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది.

అలాగే ఈ సినిమా తర్వాత రామ్ మురుగదాస్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాగా లింగుస్వామి సినిమా కు పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను రామ్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దానికి కారణం కూడా లేకపోలేదట. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రామ్ కు ఉన్న డిమాండ్ ను బట్టి ఆ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement