Saturday, April 20, 2024

మురుగదాస్ తో ఎనర్జిటిక్ స్టార్?

గజిని, సర్కార్, స్పైడర్, దర్బార్ ,స్టాలిన్ వంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు డైరెక్టర్ మురుగదాస్. అయితే తాజా సమాచారం మురుగుదాస్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేయబోతున్నాడట. ఈ మేర సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే రామ్ ను కలిసి మురుగదాస్ స్టోరీ కూడా చెప్పాడట. రామ్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలు ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది. అలాగే ప్రముఖ హీరో మాధవన్ విలన్ గా కనిపించబోతున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement