Wednesday, April 24, 2024

ఎన్టీఆర్ అఖిల్ ని టార్గెట్ చేసిన వర్మ

రామ్ గోపాల్ వర్మ…. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఒక్క తెలుగులోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా స్టార్స్ తో పని చేశారు. అయితే ఇటీవల కాలంలో వర్మ వివాదాస్పదంగా మారారు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద ట్వీట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇప్పటికే వర్మ బారిన చాలామంది హీరోలు పడ్డారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ,అక్కినేని అఖిల్ వంతు వచ్చింది.

ఓ ఈవెంట్ లో ఎన్టీఆర్ అఖిల్ సరదాగా ముచ్చటించుకుంటున్న వీడియో క్లిప్ ని పోస్ట్ చేశాడు వర్మ. అంతే కాదు భవిష్యత్తులో హీరోయిన్స్ కష్టాల్లో పడినట్టే అంటూ సెటైర్ వేశాడు. ఈ వీడియోలో ఎన్టీఆర్ అఖిల్ తొడను గిల్లుతుంటాడు. అయితే ఆర్జివి చేసిన ట్వీట్ పై అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే అఖిల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అనవసరపు విషయాల్లో వేలు ఎందుకు పెడుతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.

https://twitter.com/RGVzoomin/status/1380190463865417732?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement