Friday, April 19, 2024

ఎన్టీఆర్-అఖిల్ ని గెలికిన ఆర్జీవీ..

వర్మ ఎప్పుడు ఎవరిపై ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. ప్రతిదాంట్లో ఫన్ ఎలిమెంట్ వెతికి మరీ షేర్ చూస్తుంటాడు. దీంతో కొంతమంది ఫన్ గా తీసుకుంటే, మరికొంత మంది మాత్రం ఆర్‌జీవీ కి కౌంటర్లు వేస్తుంటారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోవడం ఆయన స్పెషల్. అలాంటి ఆర్జీవీకి ఇసారి హీరో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, అఖిల్‌ అక్కినేని చిక్కారు. గతంలో ఓ మూవీ ఈవెంట్‌లో జూనీయర్‌ ఎన్టీఆర్‌, అఖిల్‌ సరదగా చమత్కరించుకున్న వీడియోను పెట్టి వారిని ఆడుకున్నాడు.

ఒక ఈవెంట్‌లో ఎన్టీఆర్‌, అఖిల్‌ కలిసిన సందర్భంలో వాళ్లు సరదగా ముచ్చటించుకుంటున్న వీడియోను షేర్‌ చేసిన ఆర్జీవి ఇక హీరోయిన్ల భవిష్యత్తు కష్టల్లో పడినట్లే… అంటూ ఇండైరెక్ట్‌గా కౌంటర్‌ వేశారు. వీడియోలో అఖిల్ తొడపై ఎన్టీఆర్ గిల్లడం చూడొచ్చు…దీంతో అఖిల్ అలా చేయొద్ద‌న్నట్లు ఎన్టీఆర్ చేతిని త‌న తొడ‌పై నుంచి తీసేస్తాడు. ఎన్టీఆర్ అంత‌టితో ఊరుకోకుండా మ‌రోసారి అఖిల్ తొడపై చేతిని వేసే ప్ర‌య‌త్నం చేస్తాడు. దీంతో అఖిల్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు క‌న‌ప‌డ‌తాడు. దీనికి ఆర్జీవీ కామెంట్ చేస్తూ..ఇంకా హీరోయిన్ల భవిష్యత్ ఏంటి? హీరోయిన్ల విషయంలో చాలా విచారం ఫీలవుతున్నా..సో శాడ్అం..టూ శాడ్ నెస్ ఈమోజీల్ని ఆశ్చర్యం వ్యక్తపరిచే ఈమోజీల్ని పెట్టి వీడియోని షేర్ చేశాడు. అయితే..ఆర్జీవీ ట్వీట్‌పై అటు నందమూరి, ఇటు అక్కినేని ఫాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు పెగ్గులు పడగానే.. ఏది పడితే అది మాట్లాడుతావు.. నీ గురించి మాకు తెలియదా అంటూ ఆర్జీవీపై మండిపడుతున్నారు ఫ్యాన్స్‌. 

Advertisement

తాజా వార్తలు

Advertisement