Friday, June 25, 2021

గెట్ వెల్ సూన్ బన్నీ..మెసేజ్ పంపిన చరణ్-ఉపాసన

కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి రామ్ చరణ్ దంపతులు ఓ స్వీట్ మెసేజ్ పంపారు. రామ్ చరణ్-ఉపాసన బన్నీ కోలుకోవాలని స్వీట్ మెసేజ్‌తో పాటు కొన్ని వ‌స్తువులను పంపారు. వాటిని ఫొటో తీసి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకున్నారు బ‌న్నీ. చ‌ర‌ణ్ పంపిన మెసేజ్‌లో నీ ఆరోగ్యం త్వ‌ర‌గా కుదుట ప‌డాల‌ని కోరుకుంటున్నాను. నువ్వు కోలుకున్నాక ఓ సారి క‌లుద్దాం అంటూ చ‌ర‌ణ్ ఆ లెట‌ర్‌లో రాశారు.

ఇక అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం తాను క‌రోనా బారిన ప‌డిన విష‌యం సోష‌ల్ మీడియా ద్వారా తెలిపిన సంగ‌తి తెలిసిందే. తేలిక పాటి ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని, త్వ‌ర‌లోనే మిమ్మ‌ల్ని క‌లుస్తానంటూ బ‌న్నీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. బ‌న్నీకి క‌రోనా అని తెలిసిన వెంట‌నే అభిమానులు, ప‌లువురు ప్ర‌ముఖులు త్వ‌ర‌గా కోలుకోవాలి అంటూ సోష‌ల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. ఇక తాజాగా కాగా బన్నీ “పుష్ప”సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News