Wednesday, May 19, 2021

చరణ్-శంకర్ సినిమాలో సల్మాన్..?

రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో ఓ మూవీ వస్తుందని తెలియగానే అప్పటి నుంచే ఆ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. శంకర్ అంటే కేవలం సౌత్ డైరెక్టర్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ దర్శకుడు.. అలాగే రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియన్ హీరో అయిపోవడం ఖాయం. దీంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి వెళ్లాయి. దిల్‌ రాజు నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమా జూలైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక మూవీ కాస్టింగ్ పై ఎప్పుడు ఎదో ఒక గాసిప్ బయటకువస్తోంది. తాజాగా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఓ పాత్రను దక్షిణాదిలో సూపర్‌ క్రేజ్‌ ఉన్న చిరంజీవితో చేయించాలనే ఆలోచనలో ఉన్నారట శంకర్‌. అయితే ఇదే పాత్రను హిందీలో సల్మాన్‌ఖాన్‌తో చేయించాలనుకుంటున్నారట. చిరంజీవి– రామ్‌చరణ్‌– సల్మాన్‌ ఖాన్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ కారణంగా చరణ్‌ సినిమాలో సల్మాన్‌ఖాన్‌ నటించే అవకాశాలు లేకపోలేదని టాక్‌. పైగా కథకి ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో సల్లూ భాయ్‌ పచ్చజెండా ఊపుతారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి సల్మాన్‌ నిర్ణయం ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు ఓపికపట్టాలి మరి.

Advertisement

తాజా వార్తలు

Prabha News