Thursday, April 25, 2024

గ్రీన్ కో సంస్థపై రామ్ చరణ్ ప్రశంసలు

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత అంటూ మాట వినిపిస్తోంది. ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అయితే గ్రీన్ కో సంస్థ చైనా నుంచి 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, పెద్ద సంఖ్యలో సిలిండర్లను తెప్పించి తెలంగాణ ప్రభుత్వానికి అందించింది.

కాగా దీనిపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ… గ్రీన్ కో సంస్థ కు అభినందనలు తెలిపారు.కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తోందని కొనియాడారు. గ్రీన్ కో తన స్నేహితుడికి చెందిన సంస్థ అని రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement