Wednesday, April 24, 2024

వైర‌ల్ గా రామ్ చ‌ర‌ణ్.. దీపిక ప‌దుకొణేల ఫొటో

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. బాలీవుడ్ బ్యూటీ దీపిక ప‌దుకొణే క‌లిసి దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ పిక్ లో ఆఫ్ షోల్డర్ బ్లాక్ వెల్వెట్ గౌన్ లో దీపిక మరింత ఆకర్షనీయంగా కనిపించింది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును కైవసం చేసుకుంది. అవార్డుల కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ లోని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చ‌రణ్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కార్తికేయ, రమా రాజమౌళి తదితులు హాజరయ్యారు. మరోవైపు బాలీవుడ్ భామ దీపికా పదుకునే గెస్ట్ గా అవార్డుల ఫంక్షన్ లో మెరిసింది. ఈ సందర్భంగా రామ్ చరణ్, దీపిక కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement