Friday, March 29, 2024

డిస్నీ+ హాట్‌స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్..!

రామ్ చ‌ర‌ణ్ మంచి జోరుమీదున్నాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో తన బ్రాండ్ వాల్యూని పెంచుకుంటున్నాడు. ఆచార్య‌, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌తో త్వ‌ర‌లోనే చరణ్ ప్రేక్ష‌కుల‌ని పల‌క‌రించ‌నున్నాడు. ఈ రెండు సినిమాలు థియేట‌ర్ స‌మ‌స్య‌ల‌ వ‌ల‌న ఆగిపోయాయి. ఇక వీటి తర్వాత మరో పాన్ ఇండియా మూవీలో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది.

చ‌ర‌ణ్ న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గాను స‌త్తా చాటుతున్నారు. ఇక చరణ్ పాన్ ఇండియా క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి కొన్ని బ్రాండ్స్. డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సర్వీస్‌ని ప్రమోట్ చేయడానికి రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లో చరణ్ మెజీషియన్ గా కనిపిస్తాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ప్రసారం కానుంది. బాలీవుడ్ లో కింగ్ ఖాన్- షారూఖ్ ఖాన్ డిస్నీ హాట్ స్టార్ అంబాసిడర్‌గా ఉండగా, దక్షిణాదిన రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నారు. బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు రామ్ చరణ్ భారీ మొత్తం డిమాండ్ చేయగా, అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తమ సంస్థ‌కు చ‌ర‌ణ్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండ‌డంపై స‌ద‌రు సంస్థ కూడా సంతోషం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: తనీష్ ‘మరో ప్రస్థానం’ ట్రైలర్ విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement