Thursday, November 28, 2024

Rakul Preet Singh | స‌రికొత్త లుక్ లో ర‌కుల్….

స్టార్ స్టేటస్‌ను చూసింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత అనూహ్యంగా ఇక్కడ మాయమయిపోయి బాలీవుడ్ తెరపై మెరిసింది. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా రకుల్‌కు స్టార్ స్టేటస్ ఇచ్చారు. ముఖ్యంగా అక్కడ తనకు హిట్స్, ఫ్లాప్స్ అని తేడా లేకుండా ఆఫర్లు వచ్చిపడ్డాయి.

అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లోని చాలామంది స్టార్ హీరోలతో జోడీకట్టింది రకుల్. ఆ తర్వాత బీ టౌన్ హీరో, ప్రొడ్యూసర్ అయిన జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. జాగీ భగ్నానీ, రకుల్ కలిసి సినిమా ఏమీ చేయలేదు. కానీ వారికి ఉన్న కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసి ప్రేమలో పడి పెళ్లితో ఒకటయ్యారు.

పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క సినిమాను కూడా ఓకే చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఫోటోలు షేర్ చేస్తోంది. తాజాగా తను షేర్ చేసిన ఫోటోల్లో వెరైటీ హెయిర్ స్టైల్ గురించి ఫ్యాన్స్ చర్చించుకోవడం మొదలుపెట్టారు. సినిమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా.. అవార్డ్ ఫంక్షన్స్, మూవీ ఈవెంట్స్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను కనువిందు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement