Thursday, April 25, 2024

ఆంగ్ల పత్రికపై రకుల్ ఫైర్….మద్దతుగా హరీష్ శంకర్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేది. అయితే ప్రస్తుతం మాత్రం ఈ అమ్మడికి టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రావట్లేదు. అయితే ఇదే విషయాన్ని చెబుతూ ఓ ఆంగ్ల పత్రిక తెలుగు చిత్రాలలో రకుల్ కి అవకాశాలు కరువయ్యాయి అని రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన రకుల్… నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే వీళ్లు హెడ్డింగ్ లో పెట్టినట్లు టాలీవుడ్ లో నాకు అవకాశాలు రావడం లేదని నేను ఎప్పుడు చెప్పాను. అసలు ఒక ఏడాదికి ఎన్ని సినిమాలు చేయగలం 365 రోజుల్లో ఇప్పుడు నేను చేస్తున్న ఆరు సినిమాలు కాకుండా కొత్తవాటికి దయచేసి డేట్స్ సర్దుబాటు చేయండి. ఒకవేళ మీరు అలా చేయగలిగితే ఈ విషయంలో మా టీమ్ కి సహాయం చేయండి అంటూ ట్వీట్ చేసింది.

అయితే రకుల్ చేసిన ట్వీట్ పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. నాకు తెలుసు రకుల్ షూటింగ్ లతో నువ్వు ఎంత బిజీగా ఉన్నావో ఇటీవల నా ఫ్రెండ్ రాసిన స్క్రిప్ట్ నీకు బాగా నచ్చింది. అయినప్పటికీ నీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ ప్రాజెక్టు వాయిదా పడింది. అలాగే నీ సినిమాలతో అందరికీ సమాధానం చెప్పు అంటూ మద్దతుగా నిలిచాడు హరీష్ శంకర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement