Friday, October 11, 2024

Rajini Health Bulletin | నిలకడగా రజనీ ఆరోగ్యం.. రెండు రోజుల్లో డిశ్చార్జ్

సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం రాత్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. కాగా, ఆయన ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. రెండు రోజుల్లో ఆయన డిశ్ఛార్జి అవుతార‌ని తెలిపారు.

ఆయ‌న‌ గుండె నుంచి రక్త ప్రసరణ అయ్యే నాళాల్లో వాపు గుర్తించామ‌ని.. సీనియర్ కార్డియాలజిస్ట్ సాయి సతీష్ ఆధ్వర్యంలో రజనీకాంత్‌కు శస్త్ర చికిత్స చేసినట్లు వెల్లడించారు. నాన్‌ సర్జికల్‌ పద్ధతుల్లో స్టెంట్ వేసినట్లు తెలిపారు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పక్కా ప్రణాళిక ప్రకారమే శస్త్రచికిత్స జరిగిందని ఆసుపత్రి హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement