Friday, March 29, 2024

ధనుష్ హీరోయిన్ తో సూర్య

గతేడాది ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు హీరో సూర్య. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా బిజీ గా గడుపుతున్నాడు. హరి దర్శకత్వంలో నవరస పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే పాండిరాజ్ దర్శకత్వంలో మరో సినిమా, వెంట్రిమారన్ దర్శకత్వంలో కూడా మరో సినిమాకి సిగ్నల్ ఇచ్చాడు. ఇక తాజాగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్య.

ఈ సినిమాలో హీరోయిన్ గా రజిషా విజయన్ ను తీసుకోబోతున్నారట. బుల్లితెర నుండి వెండితెరకు పైకి వచ్చిన ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇటీవల ధనుష్ నటించిన కర్ణన్ చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అలాగే నటన పరంగా కూడా రజిషా విజయన్ విమర్శకులను మెప్పించింది. ఇప్పుడు స్టార్ హీరో సూర్య తో కూడా రజిషా విజయన్ సినిమా చేయబోతోంది. ఈ సినిమాను 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యనే స్వయంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement