Monday, April 12, 2021

భాగ్యనగరానికి పనయమైన తలైవా

సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ కు పయనమయ్యారు. అన్నాత్తే సినిమా షూటింగ్ నిమిత్తం రజినీకాంత్ హైదరాబాద్ ప్రత్యేక విమానం ఎక్కారు. 2020 డిసెంబర్ లో అనారోగ్యానికి గురైన ఆయన గత నెల చెన్నై లో షూటింగ్ ని ప్రారంభించారు. ఇప్పుడు తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించనున్నారు. సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 4న రిలీజ్ కాబోతోంది.

షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ బయలుదేరిన రజినీకాంత్ చెన్నై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అభిమానులు తలైవా అంటూ గోల చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Prabha News