Sunday, March 24, 2024

పిసినారి గా ఎఫ్3 లో సీనియర్ నటుడు?

అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 2. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను కూడా సాధించింది. అలాగే ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా తెరకెక్కుతోంది. అయితే ఎఫ్ 2 లో ఉన్నట్టుగానే ఎఫ్ 3 లో కూడా రాజేంద్ర ప్రసాద్ నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పిసినారి పాత్రలో కనిపించబోతున్నాడట. జంద్యాల అహనా పెళ్ళంట… సినిమా లోని కోట శ్రీనివాస్ పాత్రను కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో అనిల్ రావిపూడి ఆ పాత్రను రాసుకున్నాడట.

అంతేకాకుండా ఈ పాత్ర సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇక సీక్వెల్ లో కూడా తమన్నా మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎఫ్ 3 మొత్తం వెంకీ వరుణ్ లు భార్యల వల్ల పడే టార్చర్ నేపధ్యంలో సాగనుందట. ఇక ఈ సినిమా నిర్మాతలు దిల్ రాజు సురేష్ బాబు మరో నెలలో సినిమాను పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement