Thursday, April 18, 2024

Rajasthan – శ‌ర్వానంద్ పెళ్లి వేడుక‌లు షురూ.. ధూమ్ ధామ్ గా హ‌ల్దీ వేడుక

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. ఇందుకోసం రాజస్తాన్‌లోని జైపూర్‌ ప్యాలెస్‌ సుందరంగా ముస్తాబైంది. కాబోయే వధూవరులిద్దరూ శ‌ర్వా,ర‌క్షితల‌తో పాటు కుటుంబాలు ప్యాలెస్‌లో పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. దీనిలో భాగంగా నేడు మొదట హల్దీ ఫంక్షన్ నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో వైట్‌ డ్రెస్‌లో ఉన్న కొత్త పెళ్లి కొడుకు శర్వా ముఖమంతా పసుపుమయంగా మారింది. అతడు ప్రతీకారంగా అక్కడున్నవాళ్ల ముఖానికి సరదాగా పసుపు రుద్దుతూ కనిపించాడు. దీంతో వాళ్లందరూ మూకుమ్ముడిగా పసుపు చేతపట్టుకుని శర్వా వైపు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నేడు మెహందీ, సంగీత్ వేడుక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. ఇకు రేపు వేదమంత్రాల సాక్షిగా రక్షిత మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు శర్వానంద్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement