Thursday, April 25, 2024

మేకింగ్ వీడియో రికార్డ్స్ పై రాజమౌళి రియాక్షన్ !!

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. ఇక ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఇదే విషయమై రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… అద్భుతమైన స్పందన వస్తోంది. మీ అందరికీ ధన్యవాదాలు. ఇదంతా చూస్తుంటే మేము ట్రైలర్ ను విడుదల చేసినట్టు గా అనిపిస్తోంది.

నాపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ నేను షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఫుల్ బిజీగా ఉన్నాను. టీమ్ అంతా దీని కోసం రెండు నెలల పాటు కష్టపడ్డారు. ఆ ప్రశంసలు అన్నీ వారికే చెందుతాయి. ఇక సంగీతం అందించిన కీరవాణి గారికి అలాగే మిగతా సిబ్బందికి ధన్యవాదాలు. మేకింగ్ వీడియోను అన్ని కోణాలనుంచి అద్భుతంగా రెడీ చేసినందుకు శ్రీనివాస్ గాదెకు థాంక్స్ చెప్పాలి అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement