Wednesday, April 24, 2024

రాజమౌళికి పిచ్చి…ఎన్టీఆర్, చరణ్ కామెంట్స్ వైరల్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియాభట్, అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా… తాజాగా ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు అనే షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు మొదటి గెస్ట్ గా చరణ్ పాల్గొన్నారు.

ఈ షో లో ఎన్టీఆర్ మాట్లాడుతూ… రాజమౌళికి పెర్ఫెక్షన్ అనే పిచ్చి పట్టిందని…. ఆ పిచ్చితో ఆర్టిస్టులను చంపేస్తున్నాడని అన్నారు. ఒక సీన్ ను పదే పదే తీస్తాడట రాజమౌళి. ఇక చాల్లే అని ఎన్టీఆర్ చెప్పినా అస్సలు వినిపించుకునేవాడుకాదట. ఎహే.. ఇంకో టేక్ అంటూ విసిగిస్తాడట. రాజమౌళికి పట్టిన ఆ పిచ్చి తగ్గదని తారక్ చెప్పగా చరణ్… అవును..నిజమే నేను కూడా పడ్డాను అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఈ ఇద్దరు చెప్పిన మాటలు వైరల్ అవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement