Saturday, April 20, 2024

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన వీడియోలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇదిలా ఉండగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామరాజు పాత్రకు సంబంధించి ఓ అద్భుతమైన పోస్టర్ ను రాజమౌళి రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్ కు విశేషమైన స్పందన లభించింది.

ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల వంతు వచ్చింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాబోయే కొత్త పోస్టర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తారా లేదా అనే అనుమానాలు కూడా ఫ్యాన్స్ లో ఉన్నాయి. కానీ ఈ నెల ఆఖరికి ఖచ్చితంగా సాలిడ్ పోస్టర్ ఒకటి జక్కన్న విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement