Thursday, July 29, 2021

ఆర్ఆర్ఆర్…స్పెషల్ సాంగ్ కు భారీ బడ్జెట్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా ఈ చిత్రం లోని ఓ సాంగ్ కాస్ట్ ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఈ సాంగ్ సినిమా మొత్తానికే హైలైట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. సోమవారం నుంచి హైదరాబాదులో భారీ సెట్స్ వేసి షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ఈ పాట లో మేజర్ అట్రాక్షన్ కానుందట. మొత్తం ఈ ఒక్క పాట కోసం మూడు కోట్ల రూపాయలను రాజమౌళి ఖర్చు చేస్తున్నాడట. మరి ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News