Thursday, April 25, 2024

ఈ సారి రాజమౌళి బొమ్మ మాములుగా ఉండదట !!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ లతోపాటు మేకింగ్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్స్ పై ప్రత్యేకంగా టీమ్ ని ఏర్పాటు చేశాడట. కాగా ఇప్పుడు మరో అదిరిపోయే ప్లాన్ తో రాజమౌళి ప్రమోషన్స్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈసారి ఒక ప్రమోషనల్ వీడియో సాంగ్ ని ఈ సినిమా కోసం డిజైన్ చేయిస్తున్నాడట. భారీ సెట్టింగ్ లను కూడా అందుకోసం చెక్కుతున్నాడట జక్కన్న. మరి ఈ వీడియోతో రాజమౌళి ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement