Monday, March 25, 2024

ఛత్రపతి రీమేక్ కు క్లాప్ కొట్టిన రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం చత్రపతి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ సంగీతం అందిస్తున్నారు. అటు హీరోగా బెల్లంకొండ అలాగే దర్శకుడిగా వి.వి.వినాయక్ ఇద్దరు కూడా ఈ సినిమాతోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ పూజా కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముహూర్తం షాట్ కు రాజమౌళి క్లాప్ కొట్టగా…రమా రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే ఏ ఎం రత్నం మొదటి షాట్ కు దర్శకత్వం వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement