Saturday, April 20, 2024

అర్జున్ రెడ్డికి రాజ్ తరుణ్ థాంక్స్

రాజ్ తరుణ్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ సాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్టాండ్ అప్ రాహుల్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో దగ్గుబాటి రానా ఈ సినిమా టీజర్ ను ఇటీవలే విడుదల చేశారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

వర్ష బొల్లమ్మ పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ అలా ఇలా అనే పాటను విడుదల చేశారు. అంతేకాకుండా టీజర్ కూడా బాగుంది. చూడటానికి చాలా స్వీట్ గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు విజయ్. ఇదే విషయమై రాజ్ తరుణ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ విజయ్ దేవరకొండకు థాంక్స్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement