Saturday, April 20, 2024

గ్లోబ‌ల్ స్టార్ తో హైద‌రాబాదీ సింగ‌ర్ ..

ఈనెల 12న జరగనున్న ఆస్కార్‌ వేడుకలకు సర్వం సిద్ధమైంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటునాటు పాట ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు అంతార్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ పాట ఆస్కార్‌ పురస్కారానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. తెలుగు వారితో పాటు భారతీయులంతా ఈసారి మనకు ఆస్కార్ ఖ‌శ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళి సహా ఆర్‌ఆర్‌ఆర్‌ టీం అమెరికాలో ఉన్నారు… ఆస్కార్ 95వ అకాడమీ వేడుకల్లో రాహుల్‌ సిప్లిగంజ్‌ కాలభైరవ నాటునాటు సాంగ్‌ లైవ్‌ ఫర్మార్మెన్స్‌ ఇవ్వనున్నారు.. తాజాగా ప్రియాంక చోప్రా నిర్వహించిన ప్రీ ఆస్కార్‌ పార్టీకి రాహుల్‌ సిప్లిగంజ్‌ హాజరయ్యాడు. ఆమెతో దిగిన ఓ ఫోటోను షేర్‌ చేస్తూ మీ పార్టీలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రియాంక చోప్రాజీ అంటూ పోస్ట్‌ చేశాడు. అలాగే తార‌క్ తో దిగిన ఫోటోను కూడా ట్విట్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement