Thursday, April 25, 2024

తండ్రి కాబోతున్న రాహుల్ రామ‌కృష్ణ‌.. ప‌ర్ఫెక్ట్ ఫాద‌ర్‌గా ఉండాలంటే టిప్స్ చెప్పాలని పోస్ట్

‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్.. యాక్టర్‌ రాహుల్‌ రామకృష్ణ తాజాగా ఓ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. రాహుల్‌, తన భార్య గర్భాన్ని చూపిస్తూ ‘పర్ఫెక్ట్ ఫాదర్ గా ఉండటానికి టిప్స్ ఇవ్వండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటీజన్‌లు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement