Thursday, April 25, 2024

సప్తగిరి కి విలన్ గా రఘు

కమెడియన్ సప్తగిరి కామెడీ పాత్రలు చేస్తూనే అప్పుడప్పుడు హీరోగా కూడా మెరుస్తున్నాడు. అయితే ప్రస్తుతం సప్తగిరి ఎస్.ఆర్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై కే ఎన్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం…అలాగే సంగీత దర్శకుడు రఘు కుంచే సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారు.

వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసరాల్లో అందమైన లొకేషన్స్ లో తెరకెక్కించామని నిర్మాతలు శ్రీనివాస్ రెడ్డి రమేష్ చెబుతున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని తెలిపారు. ఇక సప్తగిరి కి జోడీగా నేహా సోలంకి నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement